Sarangapani Jathakam: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ‘సారంగపాణి జాతకం’ మూవీ ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమానుండి ఫస్ట్ సింగిల్ గా ‘సారంగో సారంగో’ వచ్చింది. తాజాగా సెకండ్ సింగిల్ ‘సంచారి… సంచారి’ని విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, వివేక్ సాగర్ స్వర రచన చేశారు. దీనిని సంజిత్ హెగ్డే గానం చేశారు. విరహవేదనతో సాగే ఈ పాట శ్రోతలకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చే విధంగా ఉంది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి, తన నమ్మకానికి మధ్య నలిగిపోయిన వ్యక్తి కథే ‘సారంగపాణి జాతకం’ అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు. ‘సంచారి’ పాట తన నమ్మకం వల్ల తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని కోల్పోయే సందర్భంలో వస్తుందని ఆయన అన్నారు. ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయుర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ‘క’ నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

