Hyderabad: హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. నవీన్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మైండ్ స్పేస్ 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఘటనతో అతడు స్పాట్ లోనే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని పరిశీలించారు. డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవీన్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
