Snakranthi Movies: వచ్చే ఏడాది సంక్రాంతికి గట్టి పోటీ ఉంటుందని, బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు పోటీ పడబోతున్నాయని వినిపించింది. అయితే దగ్గర పడుతున్న కొద్దీ క్లారిటీ వచ్చేస్తోంది. వినిపిస్తున్న దాని ప్రకారం ముగ్గుల పండగ కు మూడు సినిమాలో బరిలో నిలవబోతున్నాయట. అందులో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రాబోతోంది. బాలకృష్ణతో సితార ఫిలిమ్స్ నిర్మించిన ‘డాకూ మహారాజ్’ జనవరి 12న విడుదల కానుంది. ఇక 14న వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ కాబోతోంది. సందీప్ కిషన్ నటించిన ‘మజాకా’తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ కూడా రేస్ నుంచి తప్పుకున్నట్లు వినిపిస్తోంది. అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తమిళ,తెలుగు బాషలలో ఏకకాలంలో రిలీజ్ అవుతుందని అంటున్నారు కానీ తెలుగులో అజిత్ కు అంత మార్కెట్ లేదు కాబట్టి థియేటర్లు దొరకడం కూడా కష్టమే. సో మూడు సినిమాలే లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈ మూడు కూడా దేనికదే డిఫరెంట్ జోనర్స్ గా చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ సినిమా పొలికల్ థ్రిల్లర్ కాగా బాలకృష్ణ ది యాక్షన్ డ్రామా. వెంకటేశ్ ది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సో దీపావళి సినిమాలలాగే ఈ సారి కూడా మూడూ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇది కూడా చదవండి : Nayanthara: నయనానంద నాయిక.. నయనతార