Smart Ration Cords: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్‌కార్డుల లబ్ధిదారులకు కీలక సమాచారం వచ్చింది. కార్డులను రూపొందించే విషయంలోనూ తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. జనవరి 26 నుంచి రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ఆరంభించినా, ఇప్పటివరకూ ఒక రూపు లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో త్వరలో జారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
Smart Ration Cords: కొత్త రేషన్‌కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతున్నది. ప్రతి స్మార్ట్ రేషన్‌కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ పెట్టాలని కూడా నిర్ణయించింది. ఈ దశలోనే స్మార్ట్‌కార్డు ఎలా ఉండాలన్న దానిపై పలు రకాల డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఈ డిజైన్ల ఎంపికపై త్వరలో కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
Smart Ration Cords: రాష్ట్రంలో సుమారు 90 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా మరో 20 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే నూతన లబ్దిదారుల జాబితాను ప్రభుత్వం వెల్లడించింది. మళ్లీ మీసేవలో మరోమారు దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పరిశీల ప్రక్రియ కొనసాగుతున్నది.
Smart Ration Cords: రేషన్‌కార్డుల కుటుంబ యజమానిగా మహిళల పేరుతో, వారి ఫొటోతో ఉన్న రేషన్ కార్జులను జారీ చేయనున్నారు. రేషన్ దుకాణానికి వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ కార్డు అర్హుల వివరాలన్నీ వస్తాయని సమాచారం. ఈ మేరకు తెలంగాణ ఉన్నతాధికారుల బృందం గతంలో రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో గతేడాది పర్యటించి, నూతన కార్డులను రూపొందించేందుకు చొరవ తీసుకున్నట్టు తెలిసింది.