SLBC Praject:ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం (మార్చి 2) నాటికి తొమ్మిదో రోజుకు చేరుకున్నది. ఘటనా స్థలం వద్ద తవ్వకం పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. టీబీఎం యంత్రం తొలగింపు, బురద తరలింపు పనులు తుది దశకు వచ్చాయి. అయితే తొలుతు గుర్తించిన నలుగురి మృతదేహాలనే బయటకు తీసే అవకాశం ఉన్నదని, మిగతా నలుగురి మృతదేహాలు తీసే పరిస్థితి ఇప్పట్లో లేదని తేల్చి చెప్తున్నారు. ఇదేరోజు సాయంత్రం దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నట్టు తెలిసింది.
SLBC Praject:జీపీఆర్ రాడార్ డాటా ద్వారా 2 మీటర్ల లోతులో మెత్తటి వస్తువులు ఉన్నట్టు గుర్తించిన మార్కింగ్ వద్ద తవ్వకాలు ఈ రోజే పూర్తయ్యే అవకాశం ఉన్నది. నలుగురి మృతదేహాలుగా గుర్తించారు. ఆ నలుగురి మృతదేహాలను ఇదేరోజు వెలికి తీసే అవకాశం ఉన్నది. ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వెంటనే వారి స్వస్థలాలకు తరలించేందుకు అంబులెన్స్‌లను సిద్ధంచేసి ఉంచారు. ఈ మేరకు ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్య బృందం సిద్ధంగా ఉన్నది.
SLBC Praject:జీపీఆర్ రాడార్ డాటా ద్వారా 7 మీటర్ల లోతులో ఉన్న మెత్తటి వస్తువులను గుర్తించి రెస్క్యూ సిబ్బంది.. వాటిని మరో నాలుగు మృతదేహాలుగా గుర్తించారు. అయితే వాటిని ఇప్పటికిప్పుడు వెలికితీసే అవకాశం లేనట్టు తెలిసింది. అసలు ఆ మృతదేహాలను వెలికి తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తేల్చిచెప్పాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో షిప్ట్‌కు 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
SLBC Praject:సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు చేరుకోనున్నారు. ఆయన వనపర్తి నుంచి నేరుగా టన్నెల్ వద్దకు వెళ్తారు. టన్నెల్‌లో ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. సహాయక చర్యలను సీఎం పరిశీలిస్తారు. ఈ క్రమంలో రేంజ్ ఐజీ సత్యానారాయణ భద్రతా చర్యలను పర్యవేక్షించనున్నారు.