Rahul Sipligunj Marriage: ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి పీటలెక్కారు. తన ప్రేమించిన అమ్మాయి హరిణ్య మెడలో గురువారం తెల్లవారుజామున మూడు ముళ్ళు వేసి, రాహుల్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై, కొత్త జంటను దీవించారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు మరియు నెటిజన్లు రాహుల్-హరిణ్య జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రేమ బంధం.. పెళ్లి దాకా
గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న రాహుల్, హరిణ్యలు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, గతంలో ఆగస్టు 17న నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా గురువారం ఉదయం పెళ్లి బంధంతో ఒక్కటై, భార్యాభర్తలుగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. రాహుల్ సిప్లిగంజ్ ప్రస్థానం చూస్తే, అతను పాతబస్తీ, హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. తన అద్భుతమైన గాత్రంతో తెలంగాణ జానపద పాటలు మరియు మాస్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షోలోకి వెళ్లి, అక్కడ విజేతగా నిలిచి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.
ఆస్కార్ గెలుచుకున్న ‘నాటు నాటు’
ఎన్నో జానపద మరియు సినిమా పాటలు పాడిన రాహుల్‌కు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ (RRR) సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆ సినిమాలో రాహుల్ పాడిన ‘నాటు నాటు’ పాట ఏకంగా ప్రపంచంలోనే అత్యున్నత అవార్డు అయిన ఆస్కార్‌ను గెలుచుకుంది. దీనితో హైదరాబాద్ గల్లీలో పుట్టిన రాహుల్ పేరు ప్రపంచ వేదికపై మారుమోగింది. ఆస్కార్ అవార్డును గెలుచుకుని రాష్ట్రానికి పేరు తెచ్చిన రాహుల్‌కు, తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డ్‌ను కూడా ప్రకటించింది.
వీడియో చూడండి:
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహానికి హాజరై వధువువరులను ఆశీర్వదించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు @RaoKavitha అక్క @Rahulsipligunj pic.twitter.com/RcrGSvKcCX
— Rajesh Warangal (@Rajesh_Wgl) November 27, 2025

