Virat Kohli-Simbu : భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, తమిళ నటుడు సింబు అలియాస్ సిలంబరసన్ టీఆర్ (STR) మధ్య సోషల్ మీడియాలో చర్చ హోరెత్తుతోంది. ఓ చాట్ షోలో విరాట్, STR నటించిన “పత్తు తల” సినిమాలోని “నీ సింహం దాన్” పాటను ఇష్టపడతానని చెప్పారు.
ఈ పాట సోషల్ మీడియా రీల్స్‌లో, క్రికెట్ వీడియోల్లో వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ పోస్టులో విరాట్‌ను ట్యాగ్ చేయడంతో, STR స్పందిస్తూ “నీ సింహం దాన్ అంటే నీవు నిజమైన సింహం” అని కామెంట్ చేశారు. ఈ ఇద్దరి అరుదైన కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Also Read: Ajay Devgan: సంచలనం.. అజయ్ దేవ్‌గణ్ ప్రైవేట్ జెట్ కొనుగోలు?
Virat Kohli-Simbu: ఇద్దరూ తమ బియర్డ్ స్టైల్, ఫిట్‌నెస్‌తో సమానంగా కనిపిస్తుండటంతో, STR విరాట్ బయోపిక్‌లో నటిస్తాడనే చర్చ ముంబయిలో జోరందుకుంది. విరాట్, అనుష్క శర్మ గ్రీన్‌లైట్ ఇస్తే, STR ఈ ప్రాజెక్ట్‌కు ఎంపిక కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్‌లో రాణిస్తుండగా, STR “థగ్ లైఫ్”, “STR49”, “STR50”, “STR51” సినిమాలతో బిజీగా ఉన్నారు.