Silambarasan: తమిళంలో ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘3BHK’ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా, తమిళ హీరో శింబు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చి సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించాడు. ‘3BHK’ని చూసిన శింబు.. ఇది ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ అని, ఎమోషనల్ జర్నీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రశంసించాడు. సిద్ధార్థ్, శరత్ కుమార్ నటనకు ఫిదా అయిన శింబు, వారి పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకున్నాడు. ఈ సినిమా తమిళంలో ఇప్పటికే మంచి బజ్‌ను సృష్టించగా, తెలుగులోనూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి!
Just watched #3BHK. A heartfelt beautiful film that takes you on an emotional journey. Warm and well performed #Siddharth @realsarathkumar sir. Congrats and all the best to @sri_sriganesh89 @ShanthiTalkies and the whole team. pic.twitter.com/O6sS5PVO21
— Silambarasan TR (@SilambarasanTR_) July 1, 2025