Siddipet:ఇటీవల కుటుంబ సభ్యులతో గొడవలు సర్వసాధారణమయ్యాయి. క్షణికావేశాలతో ఎంతకాడికైనా తెగించే పనులు చేసేందుకూ వెనుకాడటం లేదు. ప్రాణాలను తీసేందుకు, తీసుకునేందుకూ సిద్ధపడుతున్నారు. ఇలాంటి కోవలో టీనేజీ యువత ఎంతో మంది బలవుతున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. చిన్న కారణంతో తల్లిపై కోపంతో ఓ యువకుడు క్షణికావేశాలకు లోనై ప్రాణాలే తీసుకున్నాడు.
Siddipet:సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. రూ.5,000 ఇవ్వాలని తన తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో గొడవకు దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మనస్తాపంతో క్షణికావేశంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు.


