Siddipet:

Siddipet: మా టీచ‌ర్లు మాకే కావాలి.. విద్యార్థుల ఆందోళ‌న‌

Siddipet: మా టీచ‌ర్లు మాకే కావాలి.. ఎందుకు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.. మేమొప్పుకోం.. మ‌ళ్లీ ర‌ప్పించండి.. అంటూ విద్యార్థులు భీష్మించుకొని కూర్చుని ఆందోళ‌న చేస్తున్న ఘ‌ట‌న సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. దుబ్బాక‌లోని క‌స్తూర్బా బాలిక‌ల పాఠ‌శాల విద్యార్థులు ఈ రోజు ధ‌ర్నా చేశారు. పాఠ‌శాల గేటు వ‌ద్ద మెట్ల‌పై కూర్చొని నినాదాలు చేస్తూ ఆందోళ‌న‌కు దిగారు.

Siddipet: మా ఉపాధ్యాయులు మాకే కావాలి.. అంటూ పాట‌లు పాడుతూ త‌మ నిర‌స‌నను వ్య‌క్తం చేశారు. వేరే పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులను ఎందుకు ఇక్క‌డికి పంపారు.. మా టీచ‌ర్ల‌నే మ‌ళ్లీ పంపండి అంటూ డిమాండ్ చేశారు. విష‌యం తెలుసుకొన్ని మండ‌ల విద్యాధికారి ప్ర‌భుదాస్ అక్క‌డికి చేరుకొని విద్యార్థుల‌ను స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *