Siddu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. దాని కొనసాగింపుగా వచ్చిన ‘టిల్లు స్వ్వేర్’ కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ‘తెలుసు కదా’ మూవీతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై దీనిని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Harudu: ‘హరుడు’ శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన దర్శకుడు ఆర్జీవీ
Siddu Jonnalagadda: ఈ సినిమా తాజా షెడ్యూల్ మహారాష్ట్రలో మొదలైంది. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టిపై పాటతో ఈ షెడ్యూల్ ను ప్రారంభించారు. అలానే 24 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో టాకీపార్ట్ కూడా చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ థమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు.