Coolie

Coolie: ‘కూలీ’ కోసం పనిలో దిగిన శృతి హాసన్!

Coolie: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శ్రుతి హాసన్ డబ్బింగ్ పనులు ప్రారంభించారు.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటోతో సహా పంచుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. శ్రుతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.‘కూలీ’లో రజినీకాంత్‌తో పాటు ఉపేంద్ర, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: Trisha: త్రిష పెళ్లిపై సంచలన కామెంట్స్!

Coolie: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ఈ మూవీ భారీ యాక్షన్ సీన్స్, రజినీ స్టైలిష్ అవతార్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలో విడుదలయ్యే ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోనుందని టాక్.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Peddi: పెద్ది సంచలనం! శివన్న లుక్‌తో హైప్ డబుల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *