Shraddha Kapoor: బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ ‘స్త్రీ’ యూనివర్స్‌ను మరింత పెద్దదిగా చేసేందుకు కొత్త యానిమేటెడ్ ఫిల్మ్ ప్రకటించింది. ‘ఛోటీ స్త్రీ’ అనే ఈ చిత్రం ‘స్త్రీ 3’కు ఆరు నెలల ముందు విడుదలవుతుంది. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (ఎమ్హెచ్సియూ)లో భాగంగా రూపొందుతున్న ఈ ఫిల్మ్, స్త్రీ కథలోని గతాన్ని చూపిస్తుంది. తాజాగా ‘థమ్మా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రద్ధా ఈ విషయం వెల్లడించారు.
‘స్త్రీ’ సినిమా 2018లో విడుదలై, భారీ హిట్ అయింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం భారతీయ సంప్రదాయ కథల ఆధారంగా హారర్, కామెడీ మిక్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘స్త్రీ 3’ 2026లో రానుంది. దానికి ముందుగా ‘ఛోటీ స్త్రీ’తో యూనివర్స్‌ను బలోపేతం చేస్తున్నారు.
Also Read: Meenakshi Chaudhary: ఫోర్స్ 3లో మీనాక్షి చౌదరి యాక్షన్ అవతారం!
ఈ యానిమేటెడ్ ఫిల్మ్‌లో స్త్రీ పాత కథలు, ఆసక్తికరమైన బ్యాక్‌స్టోరీ చూపించనున్నారు. చివర్లో భారీ క్లైమాక్స్ ఉంటుంది. అది ‘స్త్రీ 3’ కథను మరింత ఉత్తేజకరంగా ముందుకు తీసుకెళ్తుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దినేష్ విజన్‌తో కలిసి ఎమ్హెచ్సియూ లోగో కూడా వెల్లడించారు.
‘ఛోటీ స్త్రీ’లో అద్భుతమైన యానిమేషన్, గ్రిప్పింగ్ కథ ఉంటాయి. స్త్రీ యూనివర్స్‌లో గతం, భవిష్యత్తు లింక్ అవుతుంది. శ్రద్ధా ఈ ప్రాజెక్ట్‌పై ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అభిమానులు ఈ కొత్త అడ్వెంచర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వస్తాయని నిర్మాతలు చెప్పారు.