Rahul Gandhi: గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ, ఈ విషయంలో కేంద్ర సర్కార్ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. ఈ అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను గౌతమ్ అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని అన్నారు.
సౌర విద్యుత్తు కాంట్రాక్టుల కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు అదానీ గ్రూప్ 2,200 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే అభియోగాలు దేశంలో సంచలనం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ ఈరోజు (బుధవారం) రియాక్ట్ అయింది. ఇందులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీనిత్ జైన్‌లపై కేసు నమోదు చేశారనే వార్తల్లో నిజం లేదని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో గ్రీన్ ఎనర్టీ స్పష్టం చేసింది. ఈ ముగ్గురి ( గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వీనిత్ జైన్)పై సెక్యూరిటీస్‌కు సంబంధించి మోసం కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.