Shoaib Malik Divorce: సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన మూడవ భార్య, నటి సనా జావేద్‌తో కూడా విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు, వార్తలు పాక్, భారత మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న తర్వాత, షోయబ్ మాలిక్ 2024 ప్రారంభంలో పాకిస్తానీ నటి సనా జావేద్‌ను మూడో వివాహం చేసుకున్నారు. తాజాగా, పెళ్లైన కొద్ది నెలల్లోనే షోయబ్, సనా జావేద్ మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో వీరిద్దరూ ఒకరికొకరు దూరంగా, ఎటువంటి సంభాషణ లేకుండా సీరియస్‌గా కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోనే వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చింది. అంతేకాకుండా, వీరిద్దరూ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ విడాకుల వార్తలపై షోయబ్ మాలిక్ కానీ, సనా జావేద్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇవి కేవలం మీడియా ఊహాగానాలు మాత్రమే. 2007 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన 43 ఏళ్ల మాలిక్, ఇప్పటివరకు పురుషుల తరఫున మొత్తం 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రాశి వారికి ప్రతి పనిలో ఒత్తిడి పెరుగుతుంది.. జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం
పాకిస్తాన్ జట్టు తరపున అతను టెస్టుల్లో 1898 పరుగులు, వన్డేల్లో 7534 పరుగులు, టీ20ఐ ఫార్మాట్లో 2435 పరుగులు చేశాడు. టెస్టుల్లో 32 వికెట్లు, వన్డేల్లో 158 వికెట్లు, టీ20ల్లో 28 వికెట్లు కూడా పడగొట్టాడు. మాలిక్ చివరిసారిగా నవంబర్ 20, 2021న మీర్పూర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన T20I మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున ఆడాడు.