Mumbai: ప్రధాని మోదీ పై విమర్శలు చేశారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారని, భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నది ఆయన దృష్టి అని శరద్ పవార్ అన్నారు. దీని వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రతిపక్షాలు భావించాయి. అందుకే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు.
“లోక్‌సభ ఎన్నికల సమయంలో, ప్రధాని మోడీ బీజేపీ 400 సీట్లు డిమాండ్ చేశారు.. నిరంతరం తన ప్రచారంలో ఇదే చెప్పారు. బీజేపీ ఈ డిమాండ్‌కు మేము ఆశ్చర్యపోయాం, ఎందుకంటే 300 నుండి 350 సీట్లు గెలవడం ఏ పార్టీకైనా చారిత్రాత్మకంగా పరిగణించబడుతుంది. మేము 400 సీట్ల గురించి లోతుగా ఆలోచించినప్పుడు, బీజేపీకి 400 మంది ఎంపీలు కావాలని మేము గ్రహించాం, ఎందుకంటే వారి కళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపై ఉన్నాయి.’’ అని అన్నారు.