Mohammad Shami: గాయాలతో కీలక సిరీస్ లకు దూరమైన భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి ఎట్టకేలకు తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. బుధవారం బెంగాల్, మధ్యప్రదేశ్ మధ్య ఇండోర్లో ఆరంభమయ్యే రంజీ ట్రోఫీ మ్యాచ్‌తో షమి పునరాగనమం చేయనున్నాడని బెంగాల్ క్రికెట్ సంఘం ప్రకటించింది. బెంగాల్ ఆటగాడైన షమి గాయం, శస్త్రచికిత్స కారణంగా ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరమయ్యాడు. నిరుడు నవంబరులో ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమి మళ్లీ మ్యాచ్ ఆడింది లేదు.
ఇది కూడా చదవండి: Asian Champions Trophy: మెరిసిన దీపిక..భారత్ విజయం
Mohammad Shami: బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చాలా రోజులుగా పునరావాసంలో ఉన్నాడు షమీ. అక్కడే నెట్స్ లో సాధన చేశాడు. రంజీ మ్యాచ్‌తో అతని ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. షమీ సైతం తిరిగి మైదానానికి రావాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ మ్యాచ్లో తన ఫిట్నెస్ నిరూపించుకుంటే ఆస్ట్రేలియా పర్యటనకు షమీని పరిగణనలోకి తీసుకుంటారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే షమీ పూర్తిగా కోలుకోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ కివీస్ సిరీస్ సందర్భంగానే స్పష్టం చేశాడు.