TDP: చంద్రబాబు, టీడీపీకి కొంతమంది నేతలు వినయ విధేయులుగా ఉన్నారు. పార్టీ మీటింగ్ అయినా మంత్రివర్గమైనా ఏదైనా సరే.. వారు లేకుండా జరగడం అనేది దాదాపుగా అసాధ్యమే .. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు . వైసీపీ ప్రభుత్వం వేధింపులు, అక్రమ కేసులు పెట్టినా భరించి పార్టీనే నమ్ముకున్నారు. కానీ అలాంటిది చంద్రబాబు 4. 0 గవర్నమెంట్ లో వారికి ఎలాంటి మంత్రి పదవులు దక్కలేదు. నామినేటెడ్ పోస్ట్లు, కార్పోరేషన్ చైర్మన్ పదవులను దాదాపుగా ఖరారు చేసిన చంద్రబాబు.. తాజాగా డిప్యూటి స్పీకర్ గా రఘురామ కృష్ణం రాజును ఎంపిక చేశారు. కానీ పార్టీనే అంటిపెట్టుకున్న ఈ ఇద్దరు సీనియర్లను మాత్రం ఆయన ఎందుకు పక్కన పెడుతున్నారన్న చర్చ నడుస్తోంది.
టీడీపీలో ధూళిపాళ్ళ నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మోస్ట్ సీనియర్ లీడర్స్. వీరిద్దరూ సీనియర్ ఎమ్మెల్యేలు అయినా సరే వారికి ఈసారి మాత్రం పదవులు దక్కలేదు. గోరంట్ల పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీనే నమ్ముకునే ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో ఈయనే సీనియర్. ప్రజాదరణ ఉన్న లీడరైన గోరంట్ల ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. కానీ ఆయనకు ఎలాంటి కేబినేట్ పదవి దక్కలేదు. కేవలం ప్రోటెం స్పీకర్ గా ఆయనకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
TDP: జగన్ సర్కార్ లో తీవ్ర ఇబ్బందులకు గురైన మరో నేత దూళిపాళ్ల నరేంద్ర.. తాను అధ్యక్షుడిగా ఉన్న సంగండైరీపై జగన్ అనేక దాడులు చేయించినా తట్టుకున్నారు. అనేక సార్లు జైలు కెళ్లారు.. మొన్నటి ఎన్నికల్లో పొన్నూరు నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రకు ఈ సారి కూడా మంత్రి పదవి దక్కలేదు. వీరే కాదు..పార్టీ కోసం కష్టపడ్డ.. పట్టాభిరామ్, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, రావి వెంకటేశ్వరరావు, గౌతుశిరీష, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వంటి నేతలకు ఎలాంటి గౌరవ ప్రదమైన పదవులు దక్కకపోవడంపై తెలుగు తమ్ముళ్లలో చర్చ నడుస్తోంది.
అందరికీ పదవుల పందేరం సాధ్యం కాకపోయినా.. కనీసం సూపర్ సీనియర్లుగా కష్టకాలంలో కూడా పార్టీని వీడకుండా నిలిచిన వారిని పక్కన పెట్టడం వెనుక కారణాలేమి ఉంటాయానే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే నడుస్తోంది.