Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి సిద్ధార్థ్ ఆనంద్‌తో జతకట్టనున్నాడు. ‘కింగ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. దర్శకుడు రోజూ హింట్ ట్వీట్లతో ఫ్యాన్స్‌ను ఉరకలెత్తిస్తున్నాడు. నవంబర్ మొదటి వారంలో పెద్ద అనౌన్స్మెంట్ రానుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Ikkis Trailer: అమితాబ్ మనవడు హీరోగా ‘ఇక్కీస్’.. ఉత్కంఠ పెంచేసిన ట్రైలర్!
పఠాన్, జవాన్, డంకీ వంటి బ్లాక్బస్టర్లతో ఫామ్‌లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ మరో భారీ చిత్రం ‘కింగ్’లో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్, మార్ఫ్లెక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు సృష్టించింది. పఠాన్ తర్వాత షారుఖ్-సిద్ధార్థ్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ గరిష్ఠ స్థాయిలో ఉంది. షూటింగ్ దాదాపు పూర్తి కాగా, దర్శకుడు సోషల్ మీడియాలో రోజూ ఒక్కో హింట్ ట్వీట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈ ట్వీట్లు పెద్ద అనౌన్స్మెంట్ వైపు సూచిస్తున్నాయి. నవంబర్ మొదటి వారంలో ఈ బిగ్ ట్రీట్ రివీల్ కానుందని సమాచారం. మేకర్స్ ఏం ప్లాన్ చేశారో ఆసక్తికరంగా ఉంది. షారుఖ్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


