Seshachalam Forest: తిరుమల సమీపంలోని శేషాచలం అడవుల్లో పామును పోలి ఉండే ఓ అరుదైన కొత్త జాతి జీవి కనిపించింది. ఈ శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్‌లోని జీవావరణంలో అరుదైన కొత్త జాతి స్కింక్ (నలికిరి)ని కనుగొన్నట్టు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ తెలిపారు. ఈ అరుదైన జాతి జీవికి డెక్కన్ గ్రాసైల్ స్కింగ్గా నామకరణం చేసినట్టు తెలిపారు.
Seshachalam Forest: ఈ జీవికి పాక్షిక కనురెప్పలు, విభిన్న చారలతో అచ్చం పాము పోలికలతో ఉన్నది. ప్రస్తుతం ఏపీలో శేషాచలం, తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోనే ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తున్నాయని, జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఈ జీవులు నిలుస్తాయని బెనర్జీ తెలిపారు. ఇలాంటి జీవుల కోసం ప్రత్యేక పరిశోధన కొనసాగుతుందని వెల్లడించారు.
Seshachalam Forest: శేషాచలం, అమ్రాబాద్ అడవుల్లో కొనసాగే ఈ పరిశోధనకు జడ్ఎస్ఐకి చెందిన హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం, కోల్‌కతాలోని రెఫ్టిలియా విభాగం, లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేశారని జడ్ఎస్ఐ ప్రతినిధి డాక్టర్ దీపా జైస్వాల్ మరో ప్రకటనలో తెలిపారు.

