Allu Arjun Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో బన్నీ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా, రెండో పాత్ర కోసం అట్లీ ప్రత్యేకమైన లుక్‌ను రూపొందించారు, ఇది అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. ఈ పాత్ర ద్వారా చూపించే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కథలో బలమైన పునాదిగా నిలుస్తాయని సమాచారం. మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, త్వరలో మరిన్ని నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమా అట్లీ మార్క్ హై ఓల్టేజ్ డ్రామాతో ప్రేక్షకులను అలరించనుంది.
