SSMB29: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ పాత్ర అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. మొదటి సగంలో హీరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ కనిపిస్తే, రెండో సగంలో పాజిటివ్ టర్న్ తీసుకుంటుందని సమాచారం.
Also Read: Mega 157: మెగా 157 క్లైమాక్స్ కోసం భారీ ప్లాన్!
SSMB29: ఈ పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. హాలీవుడ్ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది. దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ నవలల స్ఫూర్తితో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ కథను రాశారు. ఇది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోంది. సంగీత దర్శకుడిగా కీరవాణి ఈ ప్రాజెక్ట్‌కి మరింత బలం తీసుకొస్తున్నారు. సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి!