Seethakka: గ్రామీణాభివృద్ధి పథకాలపై మంత్రి సీతక్క – కేంద్ర మంత్రి సమావేశం

Seethakka: రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు సజావుగా జరుగుతున్నప్పటికీ, మరింత నిధులు అవసరమని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. గురువారం కేంద్ర మంత్రి అధ్యక్షతన ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సచివాలయం నుంచి మంత్రి సీతక్క పాల్గొన్నారు.

పథకాల అమలుపై వివరాలు

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనల భాగంగా కేంద్రం కేటాయించిన రూ. 368.7 కోట్లులో ఇప్పటివరకు రూ. 129.64 కోట్లు (35%) వినియోగించామని మంత్రి వెల్లడించారు.

మిగిలిన నిధులను నవంబర్‌లోపు పూర్తిగా ఖర్చు చేస్తామనే నిశ్చయం వ్యక్తం చేశారు.

దక్కన్ పీఠభూమి నేలల ప్రత్యేకత దృష్ట్యా ఈ పథకానికి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరార

కేంద్ర మంత్రిగారి స్పందన

సీతక్క విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

సెప్టెంబర్ 4, 5 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగే దేశవ్యాప్త గ్రామీణాభివృద్ధి మంత్రుల చింతన్ శివిర్లో తెలంగాణ అవసరాలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు.

తెలంగాణలో అమలవుతున్న వినూత్న పథకాలను ఆ వేదికపై ప్రదర్శించుకోవాలని సూచించారు.

గ్రామీణ మహిళల ఆర్థిక బలోపేతం కోసం కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి సీతక్క స్పందన

కేంద్రమంత్రి సానుకూల ధోరణికి, సహకార హామీకి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *