Sankranti Ki Vasthunnam: ఇటీవల సంక్రాంతికే వస్తున్నాం అంటూ కన్ఫామ్ చేసిన వెంకటేవ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు ఇప్పడు డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది జనవరి 14న తెలుగువారి ముందుకు రాబోతుందీ త్రయం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెంకటేశ్, అనిల్ రావిపూడి కలయికలో ఇంతకు ముందు ‘ఎఫ్2, ఎఫ్3’ సినిమాలు వచ్చి విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం జత కట్టారు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయటంలో అనిల్ రావిపూడికి తిరుగు లేదు. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలకు పెట్టింది పేరు దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించటంలో వెంకటేశ్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలసి మూడో సారి ముగ్గుల పండక్కి వస్తుంటే ఇక తిరుగేముంది. పండగే పండగ. సంక్రాంతికి ఈ సినిమాతో పాటు బాలకృష్ణ, బాబీ సినిమా, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘భైరవం’, అజిత్ ‘విడా ముయర్చి’ రాబోతున్నాయి. మరి వీటిలో ప్రేక్షకులు ఏ యే సినిమాలను ఆదరిస్తారో చూడాలి.
