The Rajasaab: ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’. హారర్, థ్రిల్లర్ జోనర్‌లో వినోదాత్మక అనుభూతిని పంచే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ ఖల్ నాయకుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజా అప్‌డేట్ ఏంటంటే.. సంజయ్ దత్ ‘ది రాజాసాబ్’ షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ శివారులోని అజీజ్ నగర్‌లో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోలో ఈ షెడ్యూల్ జరుగుతోంది. దర్శకుడు మారుతి, ప్రభాస్, సంజయ్ దత్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంతో క్లైమాక్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
Also Read: Balakrishna: తమిళ మాస్ దర్శకుడితో బాలయ్య మూవీ?
The Rajasaab: ఈ షెడ్యూల్‌లో యాక్షన్, డ్రామా సన్నివేశాలు తెరకెక్కుతున్నట్లు సమాచారం. సినిమా గ్రాండ్ విజువల్స్, థ్రిల్లింగ్ నరేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని టాక్. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అభిమానులు ఈ అప్‌డేట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.