Sanitation Worker: ఒక్కోసారి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి చిత్రమైన నోటీసులు అందుతాయి. ఇదిగో ఇక్కడ కూడా అలాంటి నోటీసుకు సంబంధించిన వార్త ఉంది.
యూపీలో ఒక పారిశుధ్య కార్మికుడికి రూ.33.88 కోట్ల టాక్స్ కట్టాలని నోటీస్ అందింది. దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. యు.పి. రాష్ట్రంలోని అలీఘర్ జిల్లాలోని ఖైర్ ఒక నగరం. కరణ్ కుమార్ వాల్మీకి ఇక్కడి ఒక బ్యాంకులో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ యువకుడి నెల జీతం రూ. 15,000.
అయితే, ఆదాయపు పన్ను శాఖ అతనికి రూ. 33.88 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు పంపింది. దీంతో కరణ్ కుమార్ తో పాటు అతని కుటుంబం కూడా విస్తుపోయింది. కరణ్ కుమార్ నెల జీతం 15000 రూపాయలు మాత్రమే. దీంతో ఇంత టాక్స్ నేనెలా కట్టేది అంటూ అతను టెన్షన్ పడుతున్నాడు.
ఇది కూడా చదవండి: BJP: ఈనెలలోనే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు
గందరగోళం – షాక్ మధ్య, కరణ్ కుమార్ వాల్మీకి వివరాల గురించి విచారించడానికి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడి అధికారులు పోలీసు రిపోర్టు దాఖలు చేయమని చెప్పడంతో అతను పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్ళాడు. పోలీసు అధికారులు అతని ఫిర్యాదును స్వీకరించడానికి, కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీనితో కరణ్ కుమార్ వాల్మీకి తరువాత ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు.కరణ్ కుమార్ వాల్మీకి మాదిరిగానే పండ్ల రసం విక్రేత, ప్లే వర్క్‌షాప్ కార్మికుడికి ఆదాయపు పన్ను శాఖ ఇలాంటి నోటీసులు పంపడం గమనార్హం.