సంగారెడ్డి జిల్లాలో కుక్కలపై అమానుషం ప్రదర్శించారు. 31 వీధి కుక్కలపై దారుణం చూపారు. వీధి కుక్కలను కట్టేసి దారుణంగా 40 అడుగుల ఎత్తున ఉన్న బ్రిడ్జిపై నుంచి పడేశారు. దీంతో వాటిలో కొన్ని మరణించగా, బతికి ఉన్న కొన్ని తీవ్ర గాయాలతో చతికిలపడి ఉన్నాయి. స్థానికులు గమనించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం శివారులోని 40 అడుగుల ఎత్తున ఓ బ్రిడ్జి పైనుంచి కాళ్లు కట్టేసి, మూతులకు కుట్టేసి ఉన్న 31 వీధికుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు కిందికి పడేశారు. దీంతో అందులో 20 కుక్కలు మృత్యువాతపడ్డాయి. 11 కుక్కలకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన కుక్కలను చికిత్స కోసం హైదరాబాద్ నాగోల్ వెటర్నరీ దవాఖానకు తరలించారు.