Game Changer: ఇండియన్ 3’ సినిమా షూటింగ్ పూర్తి చేయకుండా శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేయడంతో కినుక వహించిన లైకా మూవీస్ అధినేత సుభాస్కరన్ తమిళ నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ తమిళ వర్షన్ రిలీజ్ ను ఆపాలంటూ కోరారు. అయితే… తాజాగా ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ ఇందులో జోక్యం చేసుకుని, శంకర్ తోనూ, సుభాస్కరన్ తోనూ మాట్లాడారట. ప్రస్తుతం ఆయన అమెరికా టూర్ లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Sangareddy: సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కలపై అమానుషం
Game Changer: అక్కడ నుండి రాగానే మార్చి నెలాఖరులోపు ‘ఇండియన్ -3’ బాలెన్స్ వర్క్ ను పూర్తి చేస్తారట. కమల్ హాసన్ మాటలతో సంతృప్తి చెందిన సుభాస్కరన్ తన ఫిర్యాదును వాపసు తీసుకోవడానికి సిద్థపడ్డారని తెలుస్తోంది. ఇటీవల పలు ఇంటర్వ్యూలలో శంకర్ ‘ఇండియన్ -3’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ‘ఇండియన్ 2’ ఆశించిన స్థాయిలో ఆడని క్రమంలో మరి మూడో భాగానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.