Samyuktha Menon: నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం ఆస్పత్రి నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రాంలో ప్రముఖ కథానాయిక సంయుక్త పాల్గొంది. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కోసం ప్రచారం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. ఈ కార్యక్రమంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొంది. ఈ కార్యక్రమం ఫొటోస్ ను సంయుక్త తన సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా షేర్ చేసింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, ”బసవతారకం ఆస్పత్రి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాకథాన్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాటంలో మనమంతా ముందుకురావాలి. ఈ ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ తీసుకురావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ను డిటెక్ట్ చేస్తే చికిత్సతో నయం చేయడానికి వీలు ఉంటుంది” అని అన్నారు. నిఖిల్ ‘స్వయంభూ’ చిత్రంతో పాటు శర్వానంద్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చిత్రాలలోనూ నటిస్తున్న సంయుక్త ఇటీవల ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు ఆమె నిర్మాణ భాగస్వామి కూడా కావడం విశేషం.
