Samantha: స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, నటిగా కాకుండా నిర్మాతగా ఆమె తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘శుభం’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడి లాంటి యువ నటీనటులతో ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని రూపొందించారు.
Also Read: Puri Jagannath: “పూరి జగన్నాథ్ రీలాంచ్: సేతుపతి, టబుతో కొత్త సంచలనం!”
Samantha : విశాఖపట్నంలో జరిగిన ‘శుభం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా సాగగా, సమంత వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, “‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘రంగస్థలం’ సినిమాల ఈవెంట్స్ ఇక్కడే జరిగాయి. అవన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్. ఈసారి ‘శుభం’తో కూడా వైజాగ్ ప్రేక్షకులు నాకు హిట్ ఇస్తారా?” అంటూ సమంత అడిగిన ప్రశ్న వైరల్‌గా మారింది. ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచాయి. ‘శుభం’ సినిమాతో సమంత మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.