Samantha: సినిమాలకు దూరంగా ఉన్నా… సమంత హవా ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఆమె వెండితెరకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది. అంతే కాదు… ‘సిటాడెల్’ వెబ్ సీరిస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. దాంతో నెటిజన్స్ ఆమెను బాగానే గుర్తుపెట్టుకుని ఆదరిస్తున్నారు. అందుకే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ లో టాప్ టెన్ హీరోయిన్ల జాబితాలో ప్రథమస్థానం కైవసం చేసుకుంది సమంత.
ఇది కూడా చదవండి: Pushpa 2: పుష్ప 2పై కంప్లైంట్.. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ..
Samantha: ఇది అక్టోబర్ మాసానికి సంబంధించి పోల్ కాగా సెప్టెంబర్ నెలలోనూ సమంత టాప్ వన్ పొజిషన్ లోనే ఉంది. ఆమె తర్వాత స్థానాన్లో అలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు. అలానే హీరోల జాబితాలో అగ్రస్థానంలో ప్రభాస్ ఉండగా, ఆ తర్వాత స్థానంలో విజయ్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్ ఉన్నారు. మరి త్వరలో సినిమాల్లో బిజీ కాబోతున్న సమంతకు రీ-ఎంట్రీలో ఎలాంటి అప్లాజ్ లభిస్తుందో చూడాలి.