Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయనను చూసి సినిమాల్లో నటించాలనే కోరికతో వచ్చి ఎందరో సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సినీ నటులెందరో ఆయన అభిమానులే కావడం విశేషం. అయితే తన ఇంటిలో కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎదిగారు. ఆ కోవలోనే చిరంజీవి సతీమణి సురేఖ మేనల్లుడు అల్లు అర్జున్ కూడా చిన్ననాటి నుంచి చిరంజీవి పట్ల వీరాభిమానం పెంచుకున్నవాడే. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Allu Arjun: చిరంజీవి నటనకే కాదు.. ఆయన వ్యక్తిత్వానికి కూడా నేను ఫ్యాన్‌ను అని అల్లు అర్జునే స్వయంగా చెప్పుకొచ్చారు. ఇటీవల ఆహాలో వస్తున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ విషయం అందరికీ తెలుసని, కానీ ఆయన వ్యక్తిత్వానికి నేను ఫ్యాన్‌ను అనే విషయం ఎవరికీ తెలియదని చెప్పారు.
Allu Arjun: తన చిన్నప్పుడే చిరంజీవి తనను, తమ్ముడిని ఫారిన్ తీసుకెళ్లేవారని అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు. ఆయనతో చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లమని, తమని కూడా ఆయన అంతే లవ్లీగా చూసుకునేవారని చెప్పారు. అయితే చిరంజీవిని తాము చిక్కు బాబాయ్ అని చిన్ననాడు పిలుచుకునే వాళ్లమని అల్లు అర్జున్ తన చిన్ననాటి జ్ఞాపకాలను బాలకృష్ణకు చెప్పేశారు.