Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ పై పాకిస్తాన్ గ్లోబల్ వివాదానికి కారణమైంది. జాయ్ ఫోరంలో ప్రసంగంలో సల్మాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన తర్వాత పాక్ అధికారులు తీవ్ర స్పందన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద సల్మాన్ ఖాన్ పేరును చేర్చి, ఆయనను ఉగ్రవాద సంబంధిత వ్యక్తిగా ప్రకటించింది. ఈ ప్రకటనపై పాక్ ప్రభుత్వం సల్మాన్ వ్యాఖ్యలను ఖండించింది.
ఈ నిర్ణయం బయటపడగానే బాలీవుడ్ హీరో అభిమానులలో ఆగ్రహం వ్యక్తమైంది. నిపుణుల ప్రకారం, ఈ ఘటన రెండు దేశాల మధ్య సాంస్కృతిక, రాజకీయ ఉద్రిక్తతలకు దారితీయే అవకాశం ఉంది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ లేదా బాలీవుడ్ వర్గాల నుండి అధికారిక స్పందన వెల్లడి చేయబడలేదు.

