Salman Khan: హీరో సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వస్తుండటంతో ప్రభుత్వం ఆయనకు వంద మంది సెక్యూరిటీ ఇచ్చింది. సికందర్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ కు వచ్చిన సల్మాన్ తోనే హీరోయిన్ రష్మిక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై షెడ్యూల్ ను పూర్తి చేసిన తర్వాత సల్మాన్ రష్మిక మురుగదాస్ బృందం తదుపరి దశ చిత్రీకరణ కోసం హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ నుండి తెరవెనుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని గమనిస్తే భారీగా షూటింగ్ స్పాట్ కి తరలి వచ్చిన జనాలు చారిత్రాత్మక ప్యాలెస్ వెలుపల గుమిగూడినట్లు కనిపిస్తోంది. ఒక వీడియోలో ఒకదానిలో రష్మిక మందన్న తన సన్నివేశం కోసం ప్రిపేర్ అవుతూ కనిపించింది. సికందర్ లో సల్మాన్ పవర్ ఫుల్ రాజవంశస్తుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో శత్రువులను భీకరంగా ఢీకొడతాడని, వారి పాలిట సింహస్వప్నం గా మారతాడని అంటున్నారు. సికందర్ 2025 ఈద్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. నదియద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్స్పై సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రా న్ని నిర్మిస్తున్నారు. అయితే 2014లో ఇదే ఫలక్ నుమా ప్యాలెస్ లో సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం జరగడం తెలిసిందే.కాగా ప్రస్తుతం షూటింగ్కి సంబంధించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
