Sajjanar: బెట్టింగ్ యాప్‌ల ప్రచారంతో సమాజంలో విషాదాలు పెరుగుతున్నాయని, యువత జీవితాలు నాశనమవుతున్నాయని టీజీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు స్వలాభం కోసం ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తూ, యువతను నేరాల బాటలోకి నడిపిస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు, బెట్టింగ్ వ్యసనానికి యువతను బలి చేస్తున్నారని విమర్శించారు.
Also Read: Hyderabad: HCAను రద్దు చేయాలి: క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి
ఈ యాప్‌ల వల్ల అనేక మంది ఆర్థికంగా నష్టపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో, సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. 29 మంది సినీ, యూట్యూబ్, సోషల్ మీడియా ప్రముఖులపై పీఎంఎల్‌ఏ కింద విచారణ జరుగుతోంది. ఈ యాప్‌ల ప్రచారం వల్ల యువతలో వ్యసనం పెరిగి, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.