AC Tips for Winter

AC Tips for Winter: ఏసీ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

AC Tips for Winter: ఈ చలికాలంలో AC వాడకం గణనీయంగా తగ్గుతుంది. మీరు వాడుతున్న పాత AC వచ్చే ఏడాది కొత్త ఎయిర్ కండీషనర్ లాగా చల్లని గాలిని అందించాలని మీరు భావిస్తే మాత్రం ఈ 5 పనులను ఇప్పుడే చేయండి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మీ AC ఎక్కువ కాలం పాడవకుండా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు వచ్చే వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. మరి పాత ఏసీ కూడా కొత్త దానిలా పనిచేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

క్లీనింగ్
ఏసీ రెండు యూనిట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. మీరు తడి గుడ్డ లేదా వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. ఏసీ ఫిల్టర్‌ను కూడా శుభ్రం చేయండి. AC ఫిల్టర్ గాలిని శుభ్రపరుస్తుంది. కాలక్రమేణా, దుమ్ము దానిలో పేరుకుపోతుంది. ఇది AC సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. విద్యుత్ వినియోగాన్ని పెంచుతుంది. అందువల్ల ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.

డ్రైనేజీ వ్యవస్థ
ఏసీ నుంచి వచ్చే నీరు పైపు ద్వారా బయటకు వెళ్తుంది. ఆ గొట్టాన్ని తనిఖీ చేయండి. గొట్టం మూసుకుపోయినట్లయితే AC లోపల నీరు పేరుకుపోతుంది. చెడు వాసన లేదా AC పనిచేయకపోవడానికి కారణం కావచ్చు.

సర్వీస్
సంవత్సరానికి ఒకసారి AC టెక్నీషియన్ ద్వారా మీ AC సర్వీస్‌ చేయించండి. వారు ఏసీని పూర్తిగా శుభ్రం చేస్తారు. గ్యాస్‌ని టెక్ చేస్తారు. అవసరమైన ఇతర మరమ్మతులు చేస్తారు. అందువల్ల సర్వీస్ చేయడం చాలా ముఖ్యం.

కవర్
ఏసీ ఉపయోగంలో లేనప్పుడు కవర్‌తో కప్పి ఉంచండి. దీంతో ఏసీలోకి దుమ్ము, క్రిములు, ఇతర కణాలు చేరవు. మీరు పాత బెడ్‌షీట్ లేదా ప్రత్యేక ఏసీ కవర్‌ని ఉపయోగించవచ్చు.

వెంటిలేషన్
శీతాకాలంలో కూడా గదిని వీలైనంత వరకు వెంటిలేషన్ చేయండి. ఇది గదిలో తేమ పేరుకుపోకుండా చేస్తుంది. ఏసీ దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Andhra Pradesh: డే1 నుంచే అభివృద్ధి.. 10 నెలల్లో నెం.2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *