Sai Pallavi: రామ్ చరణ్ నటించిన ‘‘గేమ్ ఛేంజర్’ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరన్ నటిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ మైసూరులో ఆరంభం అయింది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఇందులో సంజయ్ దత్ కూడా నటించబోతున్నట్లు వెల్లడి అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత RC17ను సుకుమార్ డైరెక్షన్ లో మొదలు పెట్టనున్నారట. ప్రస్తుతం ‘పుష్ప2’తో బిజీగా ఉన్న సుక్కు ఆ సినిమా తర్వాత పట్టాలెక్కించేది RC17 నే. లైన్ రెడీ అయిన ఈ సినిమా స్క్రీప్ట్ రెడీ కావడానికి కొంచెం టైమ్ పడుతుందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించనుందట. సాయి పల్లవి కి దక్షిణాదిన ప్రత్యేక మైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ చిత్రంలో తన క్యారెక్టర్ ను సుకుమార్ చక్కగా డిజైన్ చేయబోతున్నాడట. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో నాగచైతన్యతో ‘తండేల్’, బాలీవుడ్లో అమీర్ ఖాన్ తనయుడితో ఓ చిత్రం, రణ్ బీర్ కపూర్ ‘రామాయణం’లో నటిస్తోంది. మరి రామ్ చరణ్ తో నటించబోయే చిత్రంలో సాయిపల్లవి పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.