Suriya: సూర్య హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిగా తెరకెక్కబోతున్న పౌరాణిక చిత్రం ‘కర్ణ’ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సూర్య పాన్ ఇండియా సినిమా ‘కంగువ’ తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం వంద కోట్ల క్లబ్ లోకూడా చేరలేకపోయింది. దీంతో సూర్య హీరోగా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తీయాలనుకున్న పౌరాణిక చిత్రం ‘కర్ణ’ ను ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి. ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ‘కర్ణ’ను రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనుకున్నారు. సూర్య కర్ణుడిగాను, జాన్వీ కపూర్ ద్రౌపదిగాను నటిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం వర్కవుట్ కాదని నిర్మాతలు వెనుకాడుతున్నారట.
Suriya: దాంతో ఇక కర్ణ ప్రాజెక్ట్ ఉండక పోవచ్చని అంటున్నారు. అలాగే షాహిద్ కపూర్ తో భారీ బడ్జెట్ చిత్రం ‘అశ్వత్థామ’ సైతం బడ్జెట్ కారణాలతో ఆగిపోయినట్లు తెలియవచ్చింది. ఈ సినిమాను కూడా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందించటానికి దర్శకనిర్మాతలు వెనుకాడుతున్నారట. అంతే కాదు ‘కంగువ’ సీక్వెల్ కూడా ఉండక పోవచ్చని అంటున్నారు. సీక్వెల్ లో కార్తీ కనిపిస్తాడని అభిమానులు సంతోషపడినప్పటికీ అది సాధ్యపడకపోవచ్చంటున్నారు. మరి ‘కర్ణ’ నిజంగానే ఆగిపోయిందా! కేవలం పుకార్లేనా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.