Saffron Milk: ఆరోగ్యానికి, అందానికి కుంకుమపువ్వు పాలు ఎంతో మేలు చేస్తాయి. ఈ సంప్రదాయ పానీయం గురించి నిపుణులు అనేక ఉపయోగకర విషయాలను వెల్లడించారు. కుంకుమపువ్వును పాలతో కలిపి తాగడం వలన శరీరానికి శక్తినిచ్చే ముఖ్యమైన విటమిన్లు, పోషకాలు లభిస్తాయి.
విటమిన్ల గని కుంకుమపువ్వు పాలు:
కుంకుమపువ్వు పాలలో అనేక కీలకమైన విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అవేంటో, వాటి ప్రయోజనాలు ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
విటమిన్ ఎ: ఇది కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి: ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ డి: ఎముకలు, కండరాలు, దంతాలను బలంగా ఉంచడానికి విటమిన్ డి చాలా అవసరం.
విటమిన్ ఈ: కుంకుమపువ్వు పాలలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
విటమిన్ బి12: ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
విటమిన్ బి6: మెదడు అభివృద్ధికి, శరీరానికి శక్తిని అందించడానికి విటమిన్ బి6 సహాయపడుతుంది.
వీటితో పాటు, పాలలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు శరీరానికి అదనపు బలాన్ని ఇస్తాయి.
Also Read: Sabja Seeds: సబ్జా గింజలు వల్ల అద్భుత ప్రయోజనాలు..!
ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు:
కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
చర్మ సౌందర్యం: రోజూ ఈ పాలు తాగడం వలన చర్మం లోపలి నుండి శుద్ధి అయి, సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఒత్తిడి-ఆందోళన దూరం: ఈ పాలు తాగడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
జ్ఞాపకశక్తి పెంపు: ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
సంతానోత్పత్తి మెరుగుదల: సాంప్రదాయకంగా, కుంకుమపువ్వు పాలు పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయని నమ్ముతారు. ఇది లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది.
కుంకుమపువ్వు పాలు తాగేవారు తమ చర్మంపై హానికరమైన కణాల ప్రభావం తగ్గుతుందని, చర్మం బిగుతుగా, మృదువుగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక మంచి నివారణగా పనిచేస్తుంది. అందుకే, ప్రతి రాత్రి పడుకునే ముందు పాలలో కొద్దిగా కుంకుమపువ్వు వేసుకుని తాగడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.