Sad news: ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని రూర్కెలా సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్‌లో Shop ఘటన చోటుచేసుకుంది. ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 15 ఏళ్ల హాకీ క్రీడాకారిణిపై నలుగురు హాకీ కోచ్‌లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు.
ఏం జరిగింది?
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, బాధిత యువతి గత రెండేళ్లుగా రూర్కెలాలోని సాయ్ సెంటర్‌లో శిక్షణ పొందుతోంది. జూలై 3వ తేదీ సాయంత్రం కోచింగ్ అనంతరం నలుగురు కోచ్‌లు ఆమెను బలవంతంగా ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లి అక్కడ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమెను వారు బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొంది.
వివరాలు వెలుగులోకి రావడం:
దారుణ ఘటన జరిగిన 18 రోజుల తర్వాత, జూలై 21న బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ వివరాల ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి నలుగురు కోచ్‌లను అరెస్ట్ చేశారు. వారిపై భారతీయ న్యాయసంహితలోని వివిధ సెక్షన్లతో పాటు, సామూహిక అత్యాచారం మరియు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
కోర్టులో వాంగ్మూలం:
సోమవారం నాడు బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారు. ఈ దారుణ ఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనకు గురి చేస్తోంది. బాలికల రక్షణపై తీవ్ర చర్చలు మళ్లీ మొదలయ్యాయి. హక్కుల సంఘాలు ఈ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాయి.