Arjun Tendulkar: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు నిశ్చితార్థం జరిగినట్లుగా కథనాలు వస్తున్నాయి. అమ్మాయి పేరు: సాన్యా చందోక్ గా తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం ఆగస్టు 13న అత్యంత గోప్యంగా, కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇప్పటివరకు టెండూల్కర్ కుటుంబం కానీ, చందోక్ కుటుంబం కానీ ఈ నిశ్చితార్థం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.సాన్యా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. వారి కుటుంబం ఆహార రంగాల్లో ప్రసిద్ధి చెందింది.
వీరు ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి వ్యాపార సంస్థల యజమానులు. సాన్యా చందోక్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా మీడియాకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఆమె ప్రస్తుతం ‘Mr. Paws Pet Spa & Store’లో డైరెక్టర్ మరియు పార్టనర్‌గా ఉన్నారు. ఈ సంస్థ ముంబైలో ఉంది. ఇది ముంబైలో పెంపుడు జంతువులకు సంబంధించిన ప్రముఖ సేవల సంస్థ. ఆమె జంతు ప్రేమికురాలిగా, ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. సాన్యా చందోక్ ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె లండన్ బిజినెస్ స్కూల్‌లో ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పూర్తి చేశారు. కాగా అర్జున్ టెండూల్కర్ తరచుగా తన కుటుంబ సభ్యులతో ఉన్న చిత్రాలను పంచుకుంటారు కానీ, సాన్యా చందోక్‌తో ఉన్న చిత్రాలను పబ్లిక్‌గా పోస్ట్ చేసిన సందర్భాలు తక్కువ.
Also Read: Shubman Gill: చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్
కాగా అర్జున్ ఒక లెఫ్ట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్, అలాగే ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. ఆల్-రౌండర్‌గా తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో మొదట ముంబై తరపున ఆడిన అర్జున్, తర్వాత గోవా జట్టుకు మారారు. గోవా తరపున ఆడుతూ, రంజీ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్‌పై సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023లో తన IPL అరంగేట్రం చేశారు. 2018లో శ్రీలంకపై అండర్-19 జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.