Rupee Value: రూపాయి విలువ పడిపోయింది. ఈ రోజు అంటే డిసెంబర్ 19న రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది US డాలర్‌తో పోలిస్తే 12 పైసల పతనాన్ని చూసింది. డాలర్‌కు రూ. 85.06 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. అంతకుముందు డిసెంబర్ 18, 2024న డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.94 వద్ద ముగిసింది.
రూపాయి పతనానికి ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం అదేవిధంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు చేయడం వంటి కారణాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు. . అంతే కాకుండా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపించాయని భావిస్తున్నారు.
దిగుమతి ఖరీదైనది..
Rupee Value: రూపాయి పతనం అంటే వస్తువుల దిగుమతులు భారతదేశానికి ఖరీదైనవిగా మారుతున్నాయి. అంతే కాకుండా విదేశాలకు వెళ్లడం, విదేశాల్లో చదువుకోవడానికి కూడా ఖర్చు పెరుగుతుంది. ఉదాహరణకు డాలర్‌తో రూపాయి విలువ 50 ఉన్నప్పుడు, అమెరికాలోని భారతీయ విద్యార్థులు 50 రూపాయలకు 1 డాలర్‌ను పొందవచ్చనుకుందాం. ఇప్పుడు 1 డాలర్ కోసం విద్యార్థులు రూ.85.06 వెచ్చించాల్సి ఉంటుంది. దీనివల్ల ఫీజుల నుంచి వసతి, ఆహారం, ఇతరత్రా అన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి అవుతాయి. అలాగే, దిగుమతుల విషయంలో కూడా జరుగుతుంది. దిగుమతి చేసుకునే ఒక వస్తువు ఖరీదు ఒక డాలరు ఉంటే గతంలో అది మన దేశంలో 50 రూపాయలకు వచ్చేది. ఇప్పుడు అదే వస్తువు కోసం మనం 85 రూపాయల వరకూ వెచ్చించాల్సి వస్తుంది. డీజిల్, పెట్రోల్ వంటివి డాలర్లలోనే కొనుగోలు చేస్తారు. అందువల్ల అటువంటి వాటిపై భారం భారీగా పడుతుంది.
ఇది కూడా చదవండి: One nation one election: జమిలి ఎన్నికలపై 31 మందితో జేపీసీ
కరెన్సీ విలువ ఎలా నిర్ణయిస్తారు?
డాలర్‌తో పోలిస్తే ఏదైనా ఇతర కరెన్సీ విలువ తగ్గితే, కరెన్సీ పడిపోవడం, విలువ తగ్గిపోవడం, బలహీనపడటం అంటారు. ప్రతి దేశం అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించే విదేశీ కరెన్సీ నిల్వలను కలిగి ఉంటుంది. విదేశీ నిల్వల పెరుగుదల, తగ్గుదల ప్రభావం కరెన్సీ ధరపై కనిపిస్తుంది.
భారత విదేశీ నిల్వల్లో డాలర్లు అమెరికా రూపాయి నిల్వలతో సమానంగా ఉంటే రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. మన డాలర్ తగ్గితే రూపాయి బలహీనపడుతుంది, పెరిగితే రూపాయి బలపడుతుంది. దీనిని ఫ్లోటింగ్ రేట్ సిస్టమ్ అంటారు.