Rukmini Vasanth

Rukmini Vasanth: ఐరన్ లెగ్ గా మారిన గోల్డెన్ లెగ్!

Rukmini Vasanth: ఆర్మీ ఫ్యామిలీ నుండి చిత్రసీమలోకి అడుగుపెట్టింది రుక్మిణి వసంత్. కన్నడ మూవీ ‘బీర్బల్’ తో తెరంగేట్రమ్ చేసిందామె. ఆ సినిమా తెలుగులో ‘తిమ్మరసు’ పేరుతో రీమేక్ అయ్యింది. అయితే రుక్మిణీ వసంత్ తెలుగువారి ముందుకొచ్చిన మొదటి సినిమా ‘సప్తసాగరాలు దాటి’! రెండు భాగాలుగా వచ్చిన ఆ సినిమా ఇక్కడ గొప్ప విజయాన్ని అందుకోకపోయినా… రుక్మిణీ వసంత్ కు పలు అవకాశాలు వచ్చాయి. తెలుగు స్టార్ హీరోల సరసన కూడా ఆమె అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Jani master: జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టు ఏమందంటే . .

Rukmini Vasanth: కానీ చిత్రంగా నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ తో పరిచయం అయ్యింది. కానీ ఈ సినిమా ఇలా వచ్చి… అలా వెళ్ళిపోవడం ఆమెనే కాదు… ఆమె నటనను  ఇష్టపడే వారినీ తీవ్ర నిరాశకు గురిచేసింది. తెలుగు సినిమా రంగంలోకి గోల్డెన్ లెగ్ లా అడుగుపెడుతుందని భావించిన ఆమెను ఈ పరాజయం కృంగదీసి ఉండొచ్చు. అయితే… తమిళ, కన్నడ అనువాద చిత్రాలతో మరోసారి తెలుగువారిని రుక్మిణీ వసంత్ పలకరించబోతోంది. అవి విజయం సాధించి… ఆమెకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందిస్తాయేయో చూడాలి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Stock Market News: మహారాష్ట్ర రిజల్ట్స్ ఎఫెక్ట్ ఈరోజూ కొనసాగుతుందా? స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *