KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలుకు వచ్చారు. లగచర్ల దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ములాఖత్ కోసం అనుమతి తీసుకున్నారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం జైలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు వెంట వచ్చారు. జైలు బయట అప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేటీఆర్ కారులో అక్కడికి చేరుకోగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సందడి చేశారు.