Mutual Funds

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన అసలు నిజం..?

Mutual Funds: ప్రస్తుత కాలంలో సంప్రదాయ పొదుపు పథకాల కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే, కేవలం మీ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ సిగ్నల్ (లాభం) కనిపించినంత మాత్రాన మీరు విజయం సాధించినట్లు కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ పెట్టుబడులు ద్రవ్యోల్బణం (Inflation) ఇంకా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) కంటే మెరుగైన రాబడిని అందించినప్పుడే మీరు నిజమైన సంపదను సృష్టించగలరని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ద్రవ్యోల్బణాన్ని అధిగమించారా?

పెట్టుబడి ప్రధాన లక్ష్యం కేవలం డబ్బు పెరగడం మాత్రమే కాదు, భవిష్యత్తులో పెరిగే ధరలకు (ద్రవ్యోల్బణం) అనుగుణంగా మీ డబ్బు విలువను కాపాడుకోవడం. ఉదాహరణకు, ద్రవ్యోల్బణం 6 శాతం ఉండి, మీ ఫండ్ రాబడి 8 శాతం ఉంటే, మీ నికర లాభం కేవలం 2 శాతం మాత్రమే. అలాగే, బ్యాంకు ఎఫ్డీలు ఇచ్చే వడ్డీ కంటే మీ ఫండ్స్ ఇచ్చే రాబడి తక్కువగా ఉంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ తీసుకోవడం వృథా అని అర్థం చేసుకోవాలి.

అసలైన రాబడిని నిర్ణయించే XIRR

చాలా మంది తమ ఎస్ఐపి (SIP) రాబడులను సాధారణ రిటర్న్స్ (CAGR) ద్వారా అంచనా వేస్తారు. కానీ, ఎస్ఐపి అనేది వేర్వేరు సమయాల్లో చేసే పెట్టుబడి కాబట్టి, దాని నిజమైన పనితీరును XIRR (Extended Internal Rate of Return) ద్వారా మాత్రమే కొలవాలి. మీ యాప్స్ లేదా స్టేట్‌మెంట్లలో కనిపించే XIRR శాతాన్ని గమనించడం ద్వారా మీ పెట్టుబడి నిజంగా ఎంత లాభం ఇస్తుందో తెలుస్తుంది.

బెంచ్‌మార్క్‌తో పోలిక ముఖ్యం

మీరు ఎంచుకున్న ఫండ్ బాగా పనిచేస్తుందో లేదో తెలియాలంటే, దానిని సంబంధిత ‘బెంచ్‌మార్క్ ఇండెక్స్’తో పోల్చాలి. మీ ఫండ్ 12 శాతం రాబడి ఇచ్చినా, దాని బెంచ్‌మార్క్ ఇండెక్స్ 15 శాతం ఇస్తే, మీ ఫండ్ సగటు కంటే తక్కువ (Underperforming) పనితీరు కనబరుస్తున్నట్లు లెక్క. ఇక్కడ మీరు మీ ఫండ్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉండవచ్చు.

ఎప్పుడు మార్చాలి?

ఏదైనా ఫండ్ ఒకట్రెండు త్రైమాసికాలు తక్కువ రాబడి ఇస్తే ఆందోళన చెందక్కర్లేదు. కానీ, వరుసగా ఏడాది లేదా రెండేళ్ల పాటు మీ ఫండ్ దాని తోటి ఫండ్స్ (Peer Funds) మరియు బెంచ్‌మార్క్ కంటే వెనుకబడి ఉంటే, నిపుణుల సలహాతో మంచి ఫండ్‌లోకి మారడం వివేకం. పెట్టుబడి పెట్టి వదిలేయడం కాకుండా, కనీసం ఆరు నెలలకు ఒకసారి మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవడం తప్పనిసరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *