Jani master: టాలీవుడ్ లో సంచలనం లేపిన జానీ మాస్టర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పించింది.లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన జానీ మాస్టర్ దాదాపు నెలరోజుల పాటు జైల్లో ఉండి.. ఇటీవలే అక్టోబర్ 24న బెయిల్ పై బయటకి వచ్చాడు. అయితే బాధితురాలు జానీ మాస్టర్ కి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగింది. విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషను కొట్టివేసింది.దీంతో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది.
కాగా, జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడనున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ లో పోలీసులను ఆశ్రయించింది. తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తదుపరి అక్టోబర్ 24న ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.