AP News

AP News: డ్యూటీలో ఉండగా గుండెపోటు: ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత

AP News: విజయనగరం జిల్లా రామభద్రపురం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద డ్యూటీలో ఉన్న ఓ కండక్టర్ గుండెపోటుతో (Heart Attack) మృతి చెందారు. ఆయన పేరు దాసు.

ఈ విషాద ఘటన సాలూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు కాంప్లెక్స్ దాటుతుండగా జరిగింది. బస్సులో విధుల్లో ఉన్న కండక్టర్ దాసు ఉన్నట్టుండి తన సీట్‌లోనే కుప్పకూలారు.

చికిత్స పొందుతూ మృతి
వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, ప్రయాణికులు ఆయనను రామభద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం రామభద్రపురం ఎన్నారై ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూనే దాసు తుది శ్వాస విడిచారు.

దాసు మృతితో ఆర్టీసీ సిబ్బందితో పాటు వారి కుటుంబంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విధి నిర్వహణలో ఉండగానే ఆయన అకస్మాత్తుగా మరణించడం అందరినీ కలచివేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *