RRR: ట్రిపుల్ ఆర్’ మూవీ విడుదలై రెండున్నర యేళ్ళు గడిచినా ప్రేక్షక్షుల స్మృతిపథం నుండి ఆ చిత్రం చెరిగిపోలేదు. తాజాగా ఆ సినిమా తెరవెనుక ముచ్చట్లను తెలియచేస్తూ రాజమౌళి ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనిని ఈ నెల 20 నుండి ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: యూపీ సీఎం యోగిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
RRR: ఈ సందర్భంగా దీని ట్రైలర్ ను సామాజిక మాధ్యమాలలో విడుదల చేశారు. ‘ట్రిపుల్ ఆర్’ మేకింగ్ గురించి, అందులోని ఉత్కంఠ భరిత యాక్షన్ సీన్స్ మేకింగ్ గురించి నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలిపిన బైట్స్ ఇందులో ఉన్నాయి. ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా జెండాను తొలిసారి రెపరెపలాడించిన చిత్రంగా ‘ట్రిపుల్ ఆర్’ చరిత్రలో నిలిచిపోయింది.

