Rohit Sharma

Rohit Sharma: మరో అరుదైన రికార్డు ముంగిట రోహిత్..!

Rohit Sharma: టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ కోసం ఇరు జట్ల ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు.. ఈ మ్యాచ్‌లో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో భారత్ ఉండగా, ఇంగ్లాండ్ పరువు కాపాడుకోవాలనే ఆశతో ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఒక భారీ రికార్డు సాధించే అవకాశం ఉంది.

రోహిత్ శర్మ వన్డేల్లో మరో 13 పరుగులు సాధిస్తే, ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డుకెక్కతాడు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్,సౌరభ్ గంగూలీ, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్ ల కన్నా త్వరగా ఈ మైలురాయిని అందుకొని చరిత్రపుటల్లోకి ఎక్కుతాడు.

ప్రస్తుతం ఈ రికర్డు తొలి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ పేరు పైన ఉంది, అతడు 222 ఇన్నింగ్స్‌లోనే 11,000 పరుగులు సాధించాడు. రోహిత్ 259 ఇన్నింగ్స్‌లో 10,987 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేలో ఈ రికార్డును సులభంగా సాధించే అవకాశం ఉంది, పైగా అతను ఇప్పటికే రెండో వన్డేలో సెంచరీ బాది అతడు ఫామ్‌లో ఉన్నాడు.

Also Read: Pawan Kalyan: నేటి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌క్షిణాది యాత్ర

రోహిత్ ఈ మూడో వన్డేలో మరో సెంచరీ చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత తరఫున 50 సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం రోహిత్‌కు వన్డేల్లో 32 శతకాలు ఉన్నాయి, అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 49 సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు సచిన్ తెందూల్కర్ 100 శతకాలు సాధించగా, విరాట్ కోహ్లీ 81 సెంచరీలు చేసి, వీరిద్దరూ మాత్రమే భారత్ తరపున 50కు పైగా సెంచరీలు చేశారు.

ఇకపోతే విరాట్ కోహ్లీ ఫామ్ మాత్రం ఇప్పటికే ఆందోళనకరంగానే ఉంది. రెండో వన్డేలో జట్టు లోనికి వచ్చి సింగిల్ డిజిట్ కు అవుట్ అయిన ఈ దిగ్గజ బ్యాటర్ అతి కీలక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మూడో వన్డేలో భారీపరుగుల సాధించి ఫామ్ లోకి రావడం కీలకం. ఇప్పుడు జస్ ప్రీత్ బుమ్రా కూడా జట్టులో లేనందువల్ల కోహ్లీపై పరుగులు సాధించాల్సిన భారం ఎంతైనా ఉంది. మరి ఒత్తిడి లో ఉన్నప్పుడు తనదైన శైలిలో పుంజుకునే విరాట్ అది మళ్ళీ పునరావృతం చేస్తాడా లేదా అనేది చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *