Rohit Sharma: ఫార్మటేదైనా సరే రోహిత్ మిస్సవుతున్నాడంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరిలోనూ ఒకింత కలవరం. రాబోయే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో జరిగే తొలి టెస్టుకు గానీ లేదా రెండో టెస్టుకు గానీ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మిస్ కానున్నాడనేది కన్ఫామైంది. దీంతో ఇండియన్ క్రికెట్ సర్కిల్స్ లో ఒకటే చర్చ. రోహిత్ ఎందుకు ఆడడం లేదు? ఇదే నిజమైతే అతని స్థానంలో ఓపెనర్ వచ్చేది ఎవరు?
రోహిత్ శర్మ( Rohit Sharma) ఏ టెస్టును మిస్సవనున్నాడనే విషయంలో పూర్తి క్లారిటీ లేదు. సిరీస్ బిగినింగ్‌లో ఓ టెస్టును మిస్సవనున్నట్లు మాత్రమే రోహిత్ ఇన్ఫామ్ చేసినట్లు ఓ బీసీసీఐ అఫీషియల్ వెల్లడించాడు. ఒకవేళ రోహిత్ చెప్పిన పర్సనల్ ఇష్యూ ముందుగానే రిజాల్వ్ అయితే సిరీస్ మొత్తానికి కూడా అతను అందుబాటులో ఉంటాడని కూడా బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్ ఆడాడు. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మొదలయ్యే 3 టెస్టుల సిరీస్‌లోనూ అతను టీమిండియాను నడిపించనున్నాడు. రోహిత్ ఆసీస్ సిరీస్‌లో ఓ టెస్టు మిస్సయితే అవకాశం ఎవరిని వరించనుందనేది అందరిలో మెదులుతున్న సందేహం. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌కు ఓపెనర్లుగా ఆడిన అనుభమున్నా… దేశవాళీ టోర్నీలో మేటి ఇన్నింగ్స్ తో అద్భుత ఫామ్ లో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ కే అవకాశాలు ఎక్కువ. ఆసీస్‌లో ఇండియా ఎ జట్టు సారథిగా కూడా అభిమన్యు ఉండే అవకాశముంది.
ఆసీస్ సిరీస్ కు వైస్ కెప్టెన్ ఎవరన్నది మరో ఆసక్తికరమైన చర్చ. బంగ్లా సిరీస్‌లో డిప్యూటీ లేకుండానే రోహిత్( Rohit Sharma) విజయం సాధించాడు. ఆసీస్ సిరీస్ సమీపిస్తున్నా ఆ ప్రస్తావన రావడం లేదు. అభిషేక్ నాయర్ మాటల్లో చెప్పాలంటే… జట్టులో ఐపీఎల్ కెప్టెన్లు చాలామందే ఉన్నారు. తగిన సలహాల కోసం సంప్రదించడానికి శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ సిద్ధంగానే ఉంటారు. ఇక రోహత్‌కు డిప్యూటీ పాత్రలో ఒదిగిపోడానికి అతని వైట్‌బాల్ డిప్యూటీ దిల్… పేస్ దిగ్గజం, ఇంగ్లండ్‌లో ఓ టెస్టులో టీమిండియాకు సారథిగా వ్యవహరించిన జస్‌ప్రీత్ బుమ్రా, కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సిద్ధంగానే ఉంటారు.